విమానంలో హర్భజన్ బ్యాట్ చోరీ

March 09, 2020
img

ప్రముఖ క్రికెట్ ఆటగాడు హర్భజన్ సింగ్ ఉపయోగించే క్రికెట్ బ్యాట్‌ను ఎవరో దొంగతనం చేశారు. ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడబోతున్న ఆయన శనివారం ముంబై నుంచి కోవైకు విమానంలో ప్రయాణించారు. కోవై విమానాశ్రయంలో దిగిన తరువాత తన క్రికెట్ కిట్ బ్యాగును తెరిచి చూస్తే దానిలో బ్యాట్ కనబడలేదు. తన బ్యాట్ కనబడకపోవడంతో షాక్ అయిన హర్భజన్ సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా సదరు విమానయానసంస్థకు ఫిర్యాదు చేశాడు. దానిపై వెంటనే స్పందించిన ఆ సంస్థ అధికారి వెంటనే దీనిపై దర్యాప్తు జరిపి బ్యాట్‌ను ఎవరు దొంగతనం చేశారో కనుగొంటామని, త్వరలోనే బ్యాట్‌ను అప్పగిస్తామని తెలిపారు. జరిగిన పొరపాటుకు విమానయానసంస్థ తరపున క్షమాపణ చెప్పారు.         


Related Post