జయేష్ రంజన్ పోటీ చేయవచ్చు: హైకోర్టు

February 07, 2020
img

తెలంగాణ ఐ‌టి మరియు పరిశ్రమల శాఖ ప్రధానకార్యదర్శి జయేష్ రంజన్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఆయన పదవిలో కొనసాగుతూ నామినేషన్ వేయడానికి వీలులేదనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతితోనే ఆయన నామినేషన్ వేసినందున దానిని తిరస్కరించడం సరికాదని కనుక ఆయన కూడా పోటీ చేయవచ్చునని హైకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది. ఈనెల 9న తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ప్రభుత్వ పెద్దల మద్దతు ఉంది కనుకనే జయేష్ రంజన్‌ నామినేషన్ వేశారని అర్దమవుతోంది. ఇప్పుడు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కనుక తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌కు ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.        


Related Post