త్వరలో ఐపిఎల్ ప్లేయర్ల వేలంపాట

December 04, 2019
img

ఈ నెల 19న కోల్‌కతాలో ఐపిఎల్ ప్లేయర్ల వేలంపాట జరుగనుంది. దానిలో పాల్గొనేందుకు భారత్‌తో సహా దేశవిదేశాలకు చెందిన 971 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకొన్నారు. వారిలో 713 మంది భారత్‌కు చెందినవారు కాగా మిగిలినవారు విదేశీ ఆటగాళ్ళు. మళ్ళీ వారిలో 215 మంది క్యాప్‌డ్‌ ప్లేయర్లు కాగా, మిగిలిన 754 మంది ఆన్‌క్యాప్‌డ్‌, ఇద్దరు అసోసియేటడ్ దేశాల ప్లేయర్లు ఉన్నారు. ఈ 971 మందిలో నుంచి దేశంలోగల వివిద ఫ్రాంచైజీలు ఆటగాళ్ళను ఎంచుకొని ఈనెల 9వ తేదీలోగా వారి జాబితాలను సమర్పించవలసి ఉంటుంది. ఒక్కో ఫ్రాంచైజ్ గరిష్టంగా 73 మంది ఆటగాళ్ళను ఎంపిక చేసుకోవచ్చు. ఆ జాబితాలలో ఉన్నవారికి మాత్రమే ఐపిఎల్ ప్లేయర్ల వేలంపాటలో అవకాశం దక్కుతుంది. ఏటా ఏప్రిల్-మే నెలల్లో జరిగే ఐపిఎల్ 20-20 మ్యాచ్‌లలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. 


Related Post