అండర్-19 వరల్డ్ కప్ టీం ఇదే...

December 02, 2019
img

వచ్చే ఏడాది జనవరి 17 నుంచి దక్షిణాఫ్రికాలో అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరుగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్‌, న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్ టీములు పోటీ పడబోతున్నాయి. ఫిబ్రవరి 19న ఫైనల్స్ జరుగుతాయి. ఈ మ్యాచ్‌లలో భారత్‌ తరపున పాల్గొనబోయే టీంను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రియం గార్గ్ ఈ అండర్-19 భారత్‌ టీంకు కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. బీసీసీఐ ఎంపిక చేసిన ఈ టీంలో మొత్తం 15 మంది ప్లేయరులున్నారు. వారి వివరాలు...    

ప్రియం గార్గ్‌(కెప్టెన్‌), ధ్రువ్‌ జరేల్‌ (వైస్‌ కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), కుషాగ్ర(వికెట్‌ కీపర్‌), విద్యాధర్‌ పాటిల్‌, ఆకాశ్‌ సింగ్‌, శుభాంగ్‌ హెగ్డే, అథర్వ అంకోలేకర్‌, యశస్వి జైస్వాల్‌, శశ్వత్‌ రావత్‌, దివ్యాంగ్‌ జోషి, రవి బిష్ణోయి, కార్తిక్‌ త్యాగి, కుమార్‌ సుశాంత్‌ మిశ్రా, దివ్యాంశ్‌ సక్సేనా.  


Related Post