బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ

October 23, 2019
img

బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో బుదవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికైన కేంద్రహోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా, కోశాధికారిగా ఎన్నికైన అరుణ్ సింగ్ ధుమాల్ కూడా నేడు బాధ్యతలు చేపట్టారు. 

బీసీసీఐ అనేక వివాదాలలో చిక్కుకోవడంతో సుప్రీంకోర్టు నియమించిన పాలకమండలి గత 33 నెలలుగా బీసీసీఐని నడిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1954లో భారత్‌ టీం కెప్టెన్‌గా చేసిన విజయనగరం సంస్థానం మహారాజు విజయానంద గజపతి బీసీసీఐ అధ్యక్షుడు చేశారు. దాదాపు 65 ఏళ్ళ తరువాత మళ్ళీ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బీసీసీఐకి పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో సునీల్ గవాస్కర్ తదితరులు తాత్కాలిక బీసీసీఐ అధ్యక్షులుగా మాత్రమే పనిచేశారు. సౌరవ్ గంగూలీ 2020 జూలై వరకు బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.  


Related Post