మేరీ కోమ్, సింధులకు పద్మ పురస్కారాలు

September 12, 2019
img

భారత్‌ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన 8 మంది మహిళా క్రీడాకారిణులు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వారిలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్‌కు పద్మవిభూషణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డులకు క్రీడాశాఖ ఎంపిక చేసింది.

ప్రముఖ కుస్తీ (రెజ్లింగ్) క్రీడాకారిణి వినేష్ ఫోగాట్, భారత్‌ మహిళా క్రికెట్ టి20 క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్, భారత్‌ మహిళా హాకీ టీం కెప్టెన్ రాణీ రాంపాల్, షూటింగ్ ఛాంపియన్ సుమా శిరూర్, ప్రముఖ టేబిల్ టెన్నిస్ ప్లేయర్ మానిక బత్రా, పర్వాతారోహకులు తషి, నుంగ్షి మాలిక్ సోదరీమణులను పద్మశ్రీ అవార్డులకు క్రీడాశాఖ ఎంపిక చేసింది.


Related Post