టి-20 ఫార్మాట్‌కు మిథాలీ గుడ్ బై

September 03, 2019
img

భారత మహిళా జట్టుకు తొలి కెప్టెన్ మిథాలీ రాజ్ టి-20 ఫార్మాట్‌కు మంగళవారం గుడ్ బై చెప్పేశారు. ఆమె 2006 నుంచి ఇప్పటి వరకు మొత్తం 89 మ్యాచ్‌లు ఆడారు. టి-20 మ్యాచ్‌లలో 2,364 పరుగులు తీసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆమె 2012, 2014, 2016 వరల్డ్ కప్ పోటీలలో భారత్‌ మహిళా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మళ్ళీ 2021లో జరుగబోయే వరల్డ్ కప్ పోటీలలో భారత్‌కు కప్ తీసుకురావలనే లక్ష్యంగా పెట్టుకున్నందున టి-20 మ్యాచ్‌ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని మిథాలీ రాజ్ తెలిపారు. ఇంతకాలంగా తనకు సహాయసహకారాలు అందించిన బిసిసిఐ బోర్డు సభ్యులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 


Related Post