ప్రపంచకప్ పోటీల నుంచి భారత్‌ నిష్క్రమణ

July 10, 2019
img

ఇంగ్లాండ్‌లో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌, మాంచెస్టర్‌  వేదికగా నేడు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ప్రపంచకప్ పోటీల నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది. ప్రపంచకప్ పోటీలు మొదలైనప్పటి నుంచి టీం ఇండియా అద్భుతమైన ప్రదర్శన చూస్తున్న వారందరూ ఈసారి భారత్‌ కప్ గెలుచుకోవడం ఖాయమే భావించారు. కనుక న్యూజిలాండ్‌పై అవలీలగా విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకొంటుందని అందరూ ఆశించారు. కానీ ఆరంభంలోనే టపటపా వికెట్లు పడిపోవడంతో అందరూ ఆశలు వదిలేసుకున్నారు. ఆ సమయంలో అజయ్ జడేజా, ధోనీ గట్టిగా నిలబడి మళ్ళీ గాడినపెట్టారు. కానీ వారి పోరాటం ఫలించలేదు. 18 పరుగుల తేడాతో భారత్‌ ఓడిపోయింది. కప్ సాధించుకువస్తుందనుకున్న టీం ఇండియా అనూహ్యంగా సెమీ ఫైనల్స్ లోనే ఓటమి చవిచూసి ఇంటిబాట పట్టింది. న్యూజిలాండ్ మరోసారి ఫైనల్స్ కు చేరుకోగలిగింది.   


Related Post