సైనా నెహ్వాల్ వెడ్స్ కశ్యప్

December 14, 2018
img

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు  సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో రిజిస్టర్  వివాహం చేసుకోబోతున్నారు. అనంతరం హైదరాబాద్‌ రాయదుర్గంలో సైనా నివాసంలో ఇరుకుటుంబ సభ్యులు, బందుమిత్రుల సమక్షంలో సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోబోతున్నారు. వారిరువురూ గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో నేడు ఒకటవుతున్నారు. ఈరోజు వారి నివాసంలో జరుగబోయే వివాహ వేడుకకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు. 

ఈ నెల 16న హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని నోవా టెల్ హోటల్లో రిసెప్షన్‌ పార్టీ ఇవ్వబోతున్నారు.  రిసెప్షన్‌ పార్టీకి బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. 

Related Post