ప్రపంచ ఫుట్ బాల్ ఛాంపియన్ ఫ్రాన్స్

July 16, 2018
img

ప్రపంచ ఫుట్ బాల్ ఛాంపియన్ గా ఫ్రాన్స్ నిలిచింది. ఆదివారం సాయంత్రం క్రొయేషియాతో జరిగిన ఫైనల్స్ లో 4-2 గోల్స్ సాధించి ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకొంది. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం క్రొయేషియాను ఓడించి ఫ్రాన్స్ వరల్డ్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. మళ్ళీ క్రొయేషియాతోనే పోటీపడవలసిరావడం, ఓడించడం విశేషమే. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ పోటీలలో దిగిన క్రొయేషియా వరుసగా ప్రపంచదిగ్గజాలను ఓడిస్తూ ఫైనల్స్ చేరుకొంది. ఫైనల్స్ లో కూడా చివరివరకు చాలా గట్టిగా పోరాడింది కానీ ఫ్రాన్స్ చేతిలో మళ్ళీ మరోసారి ఓటమి పాలయింది. ఈ పోటీలో విజేతగా నిలిచినా ఫ్రాన్స్ టీమ్ రూ.262 కోట్లు, క్రొయేషియా రూ.190 కోట్లు బహుమతిగా అందుకోబోతున్నాయి.


Related Post