చెన్నై మ్యాచ్ లు అక్కడికి షిఫ్ట్!

April 12, 2018
img

కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడిఎంకె ఎంపిలు 12 రోజులపాటు పార్లమెంటు సమావేశాలకు అడ్డుపడితే, అదే సమస్య కారణంగా చెన్నై లో జరుగవలసిన ఐపిఎల్ మ్యాచ్ లు కూడా పూణేకి తరలిపోయాయి. కావేరీ బోర్డు కోసం తమిళనాడులో ఉద్యమాలు జరుగుతునందున, చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగవలసిన ఆరు మ్యాచ్ లను పూణేలో నిర్వహించాలని బిసిసిఐ, ఐపిఎల్ నిర్వాహకులు నిర్ణయించారు. ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తమ నిర్ణయాన్ని బుధవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. చెన్నైలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఆందోళనకారులు క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం కారణంగా మ్యాచ్ లను పూణేకు తరలిస్తున్నామని తెలిపారు. 

ఈ మ్యాచ్ లను నిర్వహించడానికి వైజాగ్, త్రివేండ్రం, పూణే, రాజ్ కోట్ వేదికలను ఎంపికచేయాగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ వాటిలో పూణేకు మొగ్గు చూపడంతో దానినే ఖరారు చేశామని బిసిసిఐ పాలకమండలి చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. 

Related Post