కావేరీ ఎఫెక్ట్: చెన్నైలో ఐపిఎల్ మ్యాచ్స్ రద్దు

April 11, 2018
img

కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడులో రాజకీయపార్టీలన్నీ ఉద్యమాలు మొదలుపెట్టి, ఐపిఎల్ మ్యాచ్ లను బహిష్కరించాలంటూ పిలుపునీయడంతో చెన్నైలో జరుగవలసిన మిగిలిన ఆరు మ్యాచ్ లను వేరే రాష్ట్రాలకు మార్చాలని బిసిసిఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. తమిళనాడులో అనిశ్చిత వాతావరణం నెలకొన్నందున చెన్నైలో మ్యాచ్ లు నిర్వహించడం మంచిదికాదని బిసిసిఐ భావిస్తోంది. ఐపిఎల్ టీమ్స్ లో వివిధదేశాల ఆటగాళ్ళు ఉన్నందున వారి భద్రతకు బిసిసిఐ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది కనుక వేరే రాష్ట్రాలలో ఆ మ్యాచ్ లను సర్దుబాటు చేయాలని భావిస్తోంది. బహుశః ఒకటి రెండు రోజులలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చు. 


Related Post