భారత్ ఖాతాలో 4 స్వర్ణ పతకాలు

April 07, 2018
img

ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ మరో బంగారు పతకం సాధించింది. ఇది కూడా వెయిట్ లిఫ్టింగ్ లోనే కావడం విశేషం. గుంటూరుకు చెందిన రాగల వెంకట్ రాహుల్ పురుషుల 85 కేజీల విభాగంలో ఈ పతకం సాధించాడు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ లో మొత్తం 338 కేజీల బరువు ఎత్తి భారత్ కు మరో స్వర్ణ పతకం సాధించి పెట్టాడు. 

ఇప్పటి  వరకు భారత్ మొత్తం 4 స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం సాధించింది. అన్నీ కూడా వెయిట్ లిఫ్టింగ్ లోనే కావడం విశేషం. 

మొదటిరోజున మహిళల విభాగంలో మీరాబాయి చాను బంగారు పతకం సాధించగా, పురుషుల విభాగంలో గురురాజ రజత పతకం సాధించాడు. రెండవ రోజున దీపక్ లాధర్ కాంస్య పతకం సాధించగా, సంజిత చాను బంగారు పతకం సాధించింది. శనివారం సతీష్ కుమార్ శివలింగం, వెంకట్ రాహుల్ బంగారు పతకాలు సాధించారు.


Related Post