నేటి నుంచే ఐపిఎల్ పండగ

April 07, 2018
img

క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ 11 మ్యాచ్ లు నేటి నుంచి ముంబైలో మొదలవబోతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు రాత్రి 6 గంటలకు ఐపిఎల్ ప్రారంభోత్సవ వేడుకలు మొదలవుతాయి. అనంతరం రాత్రి 8గంటలకు ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో మొట్టమొదటి మ్యాచ్ ఆడబోతున్నాయి. రెండేళ్ళపాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ తోనే ఈ సీజన్ మొదలవడం విశేషమనుకొంటే, అది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో తలపడటం మరో విశేషం. 

మొత్తం 51 రోజుల పాటు ఏకధాటిగా సాగే ఈ 11వ ఐపిఎల్ సీజన్ లో మొత్తం 8 జట్లు 60 మ్యాచ్ లు ఆడబోతున్నాయి. కనుక క్రికెట్ అభిమానులకు 51 రోజులూ పండగే పండగ. 

ఏప్రిల్ నెలలో జరుగబోయే మ్యాచ్స్, టీమ్స్, షెడ్యూల్ వివరాలు :

 

Related Post