మన బంగారు మీరాబాయి

April 06, 2018
img

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ మొదటిరోజునే భారత్ కు రెండు పతకాలు సాధించిపెట్టారు మన వెయిట్ లిఫ్టర్లు. మణిపూర్ కు చెందిన సైకోమ్ మీరాబాయి చాను బంగారు పతకం సాధించగా, కర్ణాటకకు చెందిన గురురాజ రజత పతకం సాధించాడు.  

నిన్న జరిగిన వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో పోటీలలో అందరికంటే చివరిగా వచ్చిన మీరాబాయి చాను (23) మొదట 80 కేజీలు బరువు ఎత్తింది. ఆ తరువాత తన రికార్డును తనే అధిగమిస్తూ 84కేజిలు ఎత్తింది. మూడవ రౌండులో స్నాచ్ లో 86 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ లో 110 కేజీలు కలిపి మొత్తం 196 కేజీలు బరువు ఎత్తి స్వర్ణం సాధించింది.    

ఇక కర్ణాటకలో మారుమూల గ్రామంలో ఒక లారీ డ్రైవర్ కొడుకు గురురాజ (25). అతను 56కేజీల విభాగంలో స్నాచ్ లో 111 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ లో 138 కేజీలు కలిపి మొత్తం 249 కేజీలు బరువు ఎత్తి వెండి పతకం సాధించాడు. Related Post