పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన ధోని

April 03, 2018
img

2011లో భారత్ కు ప్రపంచ కప్ సాధించిపెట్టిన టీం ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సోమవారం పద్మభూషణ్ అవార్డును అందుకొన్నారు. ప్రపంచ కప్ సాధించినందుకు అయనకు భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించింది. కనుక ఈరోజు ధోనీ మిలటరీ యూనిఫారం ధరించి మిలటరీ పద్దతిలోనే మార్చింగ్ చేసుకొంటూ వచ్చి రాష్ట్రపతికి మిలటరీ పద్దతిలోనే సెల్యూట్ చేసి అయన చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును అందుకొన్నారు. విశేషమేమిటంటే, సరిగ్గా ఏడేళ్ళ క్రితం ఏప్రిల్ 2వ తేదీన అయన సారధ్యంలో భారత్  ప్రపంచ కప్ సాధించింది. సరిగ్గా అదేరోజున అంటే ఏప్రిల్ 2వ తేదీనే ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి అయన అర్ధాంగి సాక్షి కూడా హాజరయ్యారు. ధోనీతో పాటు పలువురు పద్మ అవార్డులు అందుకొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమలో వారు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో మెసేజులు పెట్టారు. 



Related Post