ఒకేసారి ఐదుగురు వెయిట్ లిఫ్టర్లు మృతి

January 08, 2018
img


డిల్లీలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన ఐదుగురు పవర్ వెయిట్ లిఫ్టర్లు మృతి చెందారు. వారిలో ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో స్వర్ణపతకం సాధించిన సాక్షం యాదవ్ కూడా ఉన్నారు. అయన తన నలుగురు స్నేహితులు హరీష్ రాయ్, యోగేష్, సౌరభ్, టింకాలతో కలిసి పానిపట్ నుంచి డిల్లీకి తమ స్విఫ్ట్ కారులో వెళుతుండగా డిల్లీ శివార్లలో ఆదివారం తెల్లవారు జామున ఈ ఘోరప్రమాదం జరిగింది. 

డిల్లీలో దట్టమైన పొగమంచు పేరుకుపోయిన కారణంగా 5-6 మీటర్ల దూరంలో ఏముందో కనబడని పరిస్థితి నెలకొని ఉంది. ఆ కారణంగా వారి వాహనం రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని డ్డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాక్షం యాదవ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మిగిలిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతిని కారులో ఉన్నవారందరూ చనిపోవడం గమనిస్తే ఆ సమయంలో వారు చాలా వేగంగా కారు నడుపుతున్నట్లు అర్ధం అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Related Post