అమెరికా టైమ్స్ స్క్వేర్ లో బాంబు ప్రేలుడు

December 11, 2017
img

సోమవారం ఉదయం న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతంలో గల సబ్-వేలో ప్రేలుడు జరిగింది. తక్షణమే అక్కడకు చేరుకొన్న భద్రతాదళాలు పరిసర ప్రాంతాలను చుట్టుముట్టి ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ ప్రేలుడుకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు గాయపడి వారికి దొరికిపోయాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రేలుడుకు గల కారణాలు ఇంకా తెలియవలసి ఉంది.  

ఈ ఘటన మంధన్ వద్ద 8వ ఎవెన్యూలోని 42వ స్ట్రీట్ లో సబ్-వేలో జరిగింది. ఆ సమయంలో ఆ ప్రాంతం చాలా రద్దీగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్రజలెవరూ గాయపడలేదు. ఈ 42వ స్ట్రీట్ వద్ద గల స్టేషన్ గుండా వెళ్ళే పలు లోకల్ రైళ్ళను దారి మళ్ళించారు. మరికొన్నిటిని తాత్కాలికంగా రద్దు చేశారు. టైమ్స్ స్క్వేర్ లోని 8వ ఎవెన్యూను పూర్తిగా మూసివేసి భద్రతాదళాలు తనికీలు నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతానికి వెళ్ళేవారు ట్రాఫిక్ డైవర్షన్స్ వగైరాలను తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. 


Related Post