తెలంగాణాలో టాట సేవా కార్యక్రమాలు

December 07, 2017
img

తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాట) ‘తెలంగాణా సేవా డేస్’ పేరుతో నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో 14వ తేదీ నుంచి 23వరకు టాట సభ్యులు వివిధ జిల్లాలలో సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. చివరిరోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో టాట అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతోంది. 

ఈ ‘సేవా డేస్’ లో భాగంగా ‘అడాప్ట్ ఏ విలేజ్’ పధకం క్రింద టాటా సభ్యులు మోహన్ పటోళ్ళ మెడికల్ క్యాంప్ ను స్పాన్సర్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా, నరసుర్లాబాద్ మండలం, నేమి గ్రామ సమీపంలోగల స్థానిక శ్రీ షిరిడి సాయి విశ్వకళ కళ్యాణ మండపంలో డిసెంబర్ 21వ తేదీన 20 మంది వైద్యనిపుణుల బృందంతో మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నారు. 

ఈ మెడికల్ క్యాంపులో ఆస్తమా, బిపి, షుగర్, వైరల్ ఫీవర్స్, ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షలు జరిపి మందులు అందిస్తారు. అదేవిధంగా న్యూరాలజీ, ఆర్ధోపెడిక్, ఆప్తమాలజీ వైద్య నిపుణులు కూడా ఈ మెడికల్ క్యాంప్ లో పాల్గొని, నరాల వ్యాధులు, కీళ్ళు ఎముకల వ్యాధులు, కంటి వ్యాధులకు సంబంధించిన అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తారు. ఉదయం 10.00 నుంచి మద్యాహ్నం 12.00 వరకు ఈ మెడికల్ క్యాంప్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. 

అదే రోజు అదే గ్రామంలో స్థానిక న్యూ స్కూల్ మైదానంలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 3.30 వరకు మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. దీనిని టాట సభ్యులు వెంకట్ స్పాన్సర్ చేస్తున్నారు. కనుక ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టాట కోరింది.

టాట సభ్యులు ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి కలిసి మహబూబా బాద్ జిల్లాలోని చర్లపాలెం, గోపాలగిరి గ్రామాలను దత్తత తీసుకొని ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలల భవనాలు నిర్మించి ఇచ్చారు. వాటిలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తొర్రూర్ లో ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి భవనం నిర్మించి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా ‘అడాప్ట్ ఏ విలేజ్’ పధకం క్రింద చర్లపాలెం గ్రామంలో పంచాయితీ కార్యాలయ భవనం, గ్రంధాలయం మరియు పేదలకు రెండు గదుల ఇళ్ళను నిర్మించి ఇస్తున్నారు.  

‘అడాప్ట్ ఏ విలేజ్’ పధకం క్రింద టాట సభ్యులు వంశీ రెడ్డి, మురళీధర్ రెడ్డి కలిసి ఆత్మకూరును దత్తత తీసుకొని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. పేద విద్యార్ధులకు స్కూలు బ్యాగులు అందించబోతున్నారు. 

ఈ కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం వీటికి కో-ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న వంశీరెడ్డి: (410) 9485976 లేదా, 89999 99444 (ఇండియా), వెంకట్ అయెక్క: (734) 6745060, జి శ్రీధర్ రెడ్డి:93939 35368, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి (ఓవర్ సీస్ డైరెక్టర్): 98480 44747, జిబికే మూర్తి (పి.ఆర్.ఓ): 98499 40191 లను సంప్రదించవచ్చు. 



Related Post