ట్రంప్ ట్రావెల్ బ్యాన్ కు సుప్రీం లైన్ క్లియర్

December 05, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొన్న అత్యంత వివాదాస్పద ‘ట్రావెల్ బ్యాన్’ అమలుకు అమెరికన్ సుప్రీం కోర్టు మంగళవారం ఆమోదం తెలిపింది. ఇరాన్, లిబియా, చాడ్, సోమాలియా, సిరియా మరియు యెమెన్ దేశాలకు చెందిన పౌరులను 6 నెలల పాటు అమెరికాలో ప్రవేశించకుండా ట్రంప్ సర్కార్ నిషేధం విధించింది. దానిపై శాన్ ఫ్రాసిస్కో, వర్జీనియాలోని యుఎస్ సర్క్యూట్ కోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి. అవి యధాప్రకారం వాటి విచారణను కొనసాగించవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వాటి తీర్పులపై పిటిషన్లు దాఖలైతే మళ్ళీ విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

నిషేధం విధించబడిన ఆ దేశాల పౌరుల తల్లి తండ్రులు లేదా సమీప బంధువులు అమెరికాలో స్థిరపడి ఉన్నట్లయితే, వారిని మాత్రం అమెరికాలోకి అనుమతించవచ్చనే హైకోర్టు ఆదేశాలకు సుప్రీం కోర్టు కూడా సమ్మతి తెలిపింది. కనుక ఆ ఆరు దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశంపై ఆంక్షలు అమలులోకి వచ్చినట్లే భావించవచ్చు.        


Related Post