దేశంలో హైదరాబాద్ నెంబర్: 1 కాబోతోంది: ఇవాంకా

November 28, 2017
img

హైదరాబాద్, హెచ్.ఐ.సి.సి.లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవంకా ట్రంప్ ప్రసంగిస్తూ, “భారతదేశంలో హైదరాబాద్ నగరం ‘ఇన్నోవేషన్ హబ్’ గా శరవేగంగా ఎదుగుతోంది. ఆసియాలోకెల్లా అతిపెద్ద ఇంక్యూబెటర్ హైదరాబాద్ లోనే రాబోతోందని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఇన్ఫోసిస్ సిఈఓ సత్య నాదేళ్ళ ఈ హైదరాబాద్ నగరంలోనే చదువుకొన్నారు. అటువంటి వారెందరో అమెరికా ప్రజలకు స్ఫూర్తి కలిగిస్తున్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాలలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక సాధారణ ‘ఛాయ్ వాలా’ దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదగడమే కాకుండా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ దేశాన్ని చాలా చక్కగా ముందుకు నడిపిస్తున్నారు. ఆయన ప్రపంచ దేశాలకు ‘సింబల్ ఆఫ్ హోప్’ (ఆశాకిరణం) వంటివారు. ఆయన పాలనలో దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీలు స్థాపించబడుతున్నాయి. భారత్ కు చెందిన అనేకమంది వైద్యులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లు అమెరికాతో సహా దేశవిదేశాలలో తమ ప్రతిభను చాటుకొంటూ భారత్ కు గర్వకారణంగా నిలుస్తున్నారు.

ఇక అంతరిక్ష రంగంలో భారత్ చంద్రుడిని దాటుకొని  మార్స్ వరకు వెళ్ళిపోయింది. భారతీయుల ప్రతిభాపాటవాలు మాకు కూడా చాలా స్ఫూర్తి కలిగిస్తున్నాయి. వైట్ హౌస్ లో అమెరికాకు నిజమైన స్నేహితుడు భారతదేశమేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.

ఈ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. పురుషాధిక్యత ఉన్న పారిశ్రామిక రంగంలో ఒక మహిళ తనను తాను నిరూపించుకోవాలంటే పురుషుల కంటే చాలా ఎక్కువ కష్టపడాలనే సంగతి ఒక పారిశ్రామికవేత్తగా నేను తెలుసుకొన్నాను. గత రెండు దశాబ్దాలలో అమెరికాలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య 45 వరకు పెరిగింది. అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు కూడా ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థకు మూలస్థంభంగా నిలుస్తున్నారు,” అని ఇవాంకా ట్రంప్ అన్నారు.

అమెరికాతో సహా వివిధ దేశాలలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. మరికొద్ది సేపటిలో ఫలక్ నూమా ప్యాలెస్ లో జరుగబోయే విందు కార్యక్రమానికి ఆమె హాజరయ్యి, హైదరాబాద్ వంటకాలను రుచి చూడబోతున్నారు. 

Related Post