కాలిఫోర్నియాలో కాల్పులు

November 15, 2017
img

అమెరికా మళ్ళీ తుపాకుల కాల్పుల శబ్దాలు మారుమ్రోగాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని తెహమా కౌంటీ అనే మారుమూల ప్రాంతంలో రాంచో తెహమా స్కూల్ వద్ద (అమెరికా కాలమాన ప్రకారం) మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఒక దుండగుడు వాహనంపై వచ్చి తన వద్ద ఉన్న సెమీ ఆటోమేటిక్ తుపాకులతో విచాక్షణారహితంగా కాల్పులు జరుపుతూ స్కూల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ అదృష్టవశాత్తు పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకొని అతనిని మట్టుబెట్టడంతో స్కూల్లో పిల్లలు, టీచర్లు, సిబ్బంది అందరూ ప్రాణాలు దక్కాయి. అయితే అతను వాహనం వస్తూ, వేరే వాహనంలో వెళుతున్నవారిపై కాల్పులు జరపడంతో ఒక పసిబాలుడితో సహా నలుగురు మృతి చెందారు. సుమారు 10 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ దుండగుడు పోలీసులపై కూడా ఎదురుకాల్పులు జరిపాడు. కానీ ఎవరూ గాయపడకుండా అతనిని మట్టుబెట్టగలిగారు. ఈ కాల్పులకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది.

ఒకసారి ఉగ్రవాదుల సానుభూతిపరులు..మరొకసారి గన్ కల్చర్ కారణంగా అమెరికాలో ఇటువంటి హేయమైన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వీటికి అంతం ఎప్పుడో తెలియదు కానీ అంతవరకు అమాయకులైన పసిపిల్లలు, పౌరులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోక తప్పనిసరవుతోంది. ప్రపంచ దేశాలను వేలెత్తి చూపుతూ సుద్దులు చెప్పే అమెరికా ముందుగా ఈ సమస్యను పరిష్కరించుకోగలిగితే బాగుంటుంది కదా!      


Related Post