ఇరాన్-ఇరాక్ సరిహద్దులో భారీ భూకంపం

November 13, 2017
img

భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటలకు ఇరాన్-ఇరాక్ సరిహద్దు ప్రాంతాలలో భారీ భూకంపం సంభవించింది. ఇరాక్ సరిహద్దులో ఇరాన్ దేశానికి చెందిన ‘కెర్మన్ షా ప్రావిన్స్’ అనే ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో సుమారు 130 మందికి పైగా పౌరులు చనిపోగా అనేక వందలమంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం ధాటికి అనేక పెద్దపెద్ద భవనాలు పేకమేడల్లా కుప్పకూలడంతో ఆ శిధిలాల క్రింద అనేక మంది చిక్కుకుపోయారు. కనుక మృతుల సంఖ్య చాలా బారీగా పెరిగే అవకాశం ఉందని భావించవచ్చు. శిధిలాల క్రింద చిక్కుకొన్నవారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ గాడనిద్రలో ఉన్నపుడు అర్ధరాత్రిపూట భూకంపం రావడంతో అది గ్రహించి, ఇళ్ళ నుంచి ప్రజలు బయటపడేలోపుగానే భవనాలు కూలిపోవడంతో బారీగా ప్రాణనష్టం జరిగింది. 

కువాట్, యుఏఈ, టర్కీ దేశాలలో కూడా నిన్న అర్ధరాత్రి భూమి తీవ్రంగా కపించింది కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఆ దేశాలలో చాలా మంది భారతీయులు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అనేక లక్షల మంది పనిచేస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

         


Related Post