ఉత్తర కొరియాపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్

September 25, 2017
img

అమెరికా, ఉత్తర కొరియా దేశాధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, కిం జాంగ్ ఉన్ ల మద్య జరుగుతున్న మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుకొంది. ఇంతవరకు ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకొంటున్నవారిద్దరూ ఇప్పుడు ఈ భూమీద కనబడకుండా తుడిచిపెట్టేస్తామని బెదిరించుకొంటున్నారు. అమెరికా యుద్ధవిమానాలు శనివారం రాత్రి ఉత్తర కొరియా సరిహద్దుల వద్ద చక్కర్లు కొట్టడం కిం జాంగ్ ఉన్ ను ఇంకా కవ్వించినట్లయింది. ఉత్తర కొరియాను మరింత కవ్విస్తున్నట్లుగా ఆ దేశంతో సహా వెనిజులా, ఛాద్ దేశాల పౌరులపై అమెరికాలో ప్రవేశించకుండా ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అయితే ఇదివరకు సూడాన్ పై విధించిన నిషేధాజ్ఞలు ఎత్తివేస్తున్నట్లు నిన్న ప్రకటించడం విశేషం. సిరియా, ఇరాక్, లిబియా, ఇరాన్, సోమాలియా, యెమెన్‌ పౌరులపై నిషేధాజ్ఞలు యధావిధిగా కొనసాగుతాయని ప్రకటించిది. 

“అమెరికా రక్షణ బాధ్యత కనుక అమెరికాకు ముప్పుగా భావిస్తున్న ఆ దేశాల పౌరులను అనుమతించకూడదని నిర్ణయించాము,” అని డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఆరు నెలల పాటు తాత్కాలికంగా విధించిన ఈ ట్రావెల్ బ్యాన్ గడువు నిన్నటితో ముగిసిపోయింది. కనుక మళ్ళీ దానిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. 

Related Post