లండన్ రైల్లో బాంబు ప్రేలుడు

September 15, 2017
img

బ్రిటన్ రాజధాని లండన్ అండర్ గ్రౌండ్ రైలులో కొద్దిసేపటి క్రితం పెద్ద విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు కానీ బోగీలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం 8.20 గంటలకు లండన్ లోని పార్సన్ గ్రీన్ స్టేషన్ వద్ద ఈ ప్రేలుడు జరిగింది. బోగీలో ఉన్న ఒక బ్యాగులో ఒక ప్లాస్టిక్ బకెట్ దానిలో బాంబు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఇటువంటి ప్రేలుళ్ళలో బాంబు విస్పొటన ధాటికి పరిసర ప్రాంతాలలో ఉన్నవారు చనిపోతుంటారు. లేదా దానిలో అమర్చబడిన లోహ పదార్ధాలు శరీరభాగాలను చిద్రం చేయడం వలన గాయపడి చనిపోతుంటారు. కానీ ఈ రోజు లండన్ లో ప్రయోగించిన బాంబు ప్రేలినప్పుడు ప్రయాణికుల పైకి అగ్నిగోళాలు దూసుకురావడంతో విశేషం. ఆ మంటల కారణంగా చాలా మందికి జుట్టు, మొహం, చేతులు, కాళ్ళు కాలాయి. కనుక దీనిని స్థానికంగా ఎవరో తయారుచేసి ఉండవచ్చు. ఈ ప్రేలుడుకు ఎవరు బాధ్యులో ఇంకా తెలియవలసి ఉంది. ఈ ప్రేలుడులో గాయపడినవారినందరినీ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. 

Related Post