భారత్ కు చైనా మళ్ళీ వార్నింగ్

July 18, 2017
img

సిక్కిం సరిహద్దులో డొక్లాం వద్ద చైనా రోడ్డు నిర్మాణానికి పూనుకోవడంతో దానిని భారత్ అడ్డుకొంటోంది. ఆ కారణంగా గత నెలరోజులుగా ఇరుదేశాల మద్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. భారత్-చైనా సైనిక దళాలు ఎదురెదురుగా నిలిచి ఉండటంతో యుద్దవాతావరణం కమ్ముకొని ఉంది. భారత్ దళాలు తక్షణమే అక్కడి నుంచి వెనక్కు వెళ్ళాలని లేకుంటే తరిమికొడతామని చైనా హెచ్చరికలను భారత్ ఖాతరు చేయలేదు. పైగా చైనాకు ప్రతి సవాలు విసురుతున్నట్లుగా అక్కడకి మరిన్ని సైనిక దళాలను తరలించింది. భారత్ మార్కెట్ల ద్వారా ఏటా కొన్నివేలకోట్లు సంపాదించుకొంటున్న కారణంగా లేదా భారత్ ను డ్డీకొంటే చైనా కూడా బారీగా మూల్యం చెల్లించక తప్పదనే ఆలోచనతోనో చైనా మళ్ళీ ఇంతవరకు అడుగు ముందుకు వేయలేదు. కానీ భారత్ కు హెచ్చరికలు చేయడం మానుకోవడం లేదు. తాజాగా మళ్ళీ మరోసారి భారత్ ను హెచ్చరించింది. 

రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి పనులకు పూనుకోవద్దని, విధానపరమైన మార్గాలను అందుకు సాధనాలుగా ఉపయోగించుకోవడం సరికాదని హితవు పలికింది. ఇప్పటికైనా భారత్ తక్షణం తన సైనికులను వెనక్కు రప్పించుకోకపోతే సైనికపరంగా ఒత్తిడి ఇంకా పెంచవలసి ఉంటుందని హెచ్చరించింది. డొక్లాంలో భారత్ చొరబాట్లను ఖండిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి లూ కాంగ్ అన్నారు. ఇటీవల బీజింగ్ లో ఇతర దేశాల దౌత్యవేత్తలతో చైనా ప్రభుత్వం ఒక రహస్య సమావేశం నిర్వహించి, డొక్లాం వద్ద భారత్ చొరబడి తమను సవాలు చేస్తోందని పిర్యాదు చేసింది. అయితే దాని గరించి మాట్లాడేందుకు లూ కాంగ్ నిరాకరించారు. ఇప్పటికైనా భారత్ తన సైనికులను వెనక్కు తీసుకోవడమే విజ్ఞత అనిపిచంచుకొంటుందని అన్నారు. 

Related Post