ఇంగ్లాండ్ లో ఆత్మాహుతి దాడి

May 23, 2017
img

ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ నగరంలో భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. దానిలో 20 మంది పౌరులు అక్కడికక్కడే మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడినట్లు బ్రిటన్ పోలీసులు తెలిపారు. మాంచెస్టర్ ఎరీనా స్టేడియంలో నిన్న రాత్రి ప్రఖ్యాత అమెరికన్ పాప్ సింగర్ ఎరీనా గ్రాండీ సంగీత కచేరీ జరిగింది. అది ముగుస్తున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

ఆ సమయంలో స్టేడియంలో 21,000 మంది ఉన్నారు. ఈ దాడి జరిగిన వెంటనే సమీప ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి వైద్య,సహాయ బృందాలు వచ్చే వరకు గాయపడినవారిని తమ ఇళ్ళలో ఉంచి ప్రాధమిక వైద్యం అందించి మానవత్వం చాటుకొన్నారు.

ఈ ఆత్మాహుతిదాడి సంగతి తెలియగానే వైద్య సహాయబృందాలు అక్కడికి చేరుకొని గాయపడిన వారికి సమీప ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందించారు. బ్రిటన్ పోలీసులు, భద్రతాదళాలు స్టేడియంను చుట్టుముట్టి పరిసరప్రాంతాలలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇది ఉగ్రవాదుల పనే అని వారు భావిస్తున్నారు. కానీ ఈ దాడికి పాల్పడినవారు  ఎవరో ఇంకా ప్రకటించుకోలేదు. 

Related Post