ట్రంప్ పాలనలో మొదటి వికెట్ పడింది

January 31, 2017
img

ప్రభుత్వం తరపున న్యాయస్థానాలలో వాదించడానికి అటార్నీ జనరల్ ఉంటారు. కానీ ఆ అటార్నీ జనరలే ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడితే? వ్యతిరేకిస్తే ఏమవుతుంది? తెలుసుకోవాలంటే అమెరికాలో వర్జీనియా రాష్ట్ర అదనపు అటార్నీ జనరల్ శాలీ యేట్స్ కధ తెలుసుకోవలసిందే.

ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ డోనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆమె గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక తన క్రింద పనిచేస్తున్న లాయర్లకు కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించమని కోరుతూ లేఖలు వ్రాశారు. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు ఫెడరల్ కోర్టులలో వేసిన పిటిషన్లపై అమెరికా ప్రభుత్వం తరపున శాలీ యేట్స్ బృందం వాదించవలసి ఉంది కానీ అందుకు ఆమె నిరాకరించడంతో, “ఆమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమే వ్యవహరిస్తుంనందున తక్షణమే ఆమెను పదవి నుంచి తప్పిస్తున్నట్లు” వైట్ హౌస్ నుంచి నిన్న రాత్రి ఒక ప్రకటన వెలువడింది.  

ఒబామా హయాంలో నియమించబడిన కొందరు అధికారులు తన ప్రభుత్వానికి సహకరించకుండా ఈవిధంగా అవరోధాలు సృష్టిస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించబోనని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ తన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న అధికారులను తొలగించవచ్చు. వారి స్థానంలో ఈవిధంగా వేరొకరిని నియమించుకోవచ్చు. కానీ తన నిర్ణయం సరైనదేనని కోర్టులను, కాంగ్రెస్ ను కూడా ఒప్పించవలసి ఉంటుంది.

ట్రంప్ నిర్ణయాన్ని కొన్ని ఫెడరల్ కోర్టులు కూడా తప్పు పట్టాయి. వాటిలో ఒక కోర్టు అయన నిర్ణయాలు రాజ్యాంగ విరుద్దమని కనుక వాటిపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. కనుక అమెరికా ప్రభుత్వం తరపున ఫెడరల్ కోర్టులలో వాదనలు వినిపించి, వాటిని ఒప్పించే బాధ్యత ఇప్పుడు డాన బౌంటేపై పడింది. మరి ఆయన న్యాయస్థానాలను ఒప్పించలేకపోతే ఏమవుతుందో వేచి చూడాలి.  

Related Post