డోనాల్డ్ ట్రంప్ కే అమెరికా పగ్గాలు

November 09, 2016
img

ఇంక ఏ మాత్రం సందేహాలు లేవు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో ఆయన 266 స్థానాలు సాధించగా హిల్లరీ క్లింటన్ 218 స్థానాల వద్ద నిలిచిపోయారు. అధ్యక్ష పదవి చేపట్టడానికి కనీసం 270 స్థానాలు గెలుచుకోవలసి ఉంటుంది. ట్రంప్ దూకుడు చూస్తుంటే అంతకంటే ఇంకా ఎక్కువే గెలుచుకొంటారని స్పష్టం అవుతోంది. కనుక ఆయన కనీసం 278 స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉంది. మరికొద్ది సేపటిలో పూర్తి ఫలితాలు వెలువడుతాయి. కానీ ఇంక వాటి కోసం ఎదురుచూడవలసిన అవసరం లేనట్లే. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయం అయిపోయినట్లే చెప్పవచ్చు. ఇది ప్రపంచదేశాలకి పెద్ద షాక్ వంటిదే. చాలా విచిత్రంగా, చాలా దూకుడుగా వ్యవహరించే ఆయన ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకొంటారో ఎన్నికల ప్రచార సమయంలోనే స్పష్టం చేశారు. నిజంగా వాటన్నిటినీ యధాతధంగా అమలుచేసినట్లయితే, అమెరికాతో సహా ప్రపంచం దేశాలన్నిటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆయన వలన అమెరికాకి, అమెరికన్ ప్రజలకి మేలు జరిగితే మంచిదే కానీ అమెరికాలో స్థిరపడిన లక్షలాదిమంది విదేశీయులకి, ముఖ్యంగా ముస్లింలకి, ప్రపంచదేశాలకి నష్టం కలుగకుండా ఉంటేచాలని అందరూ భావించవలసి వస్తోంది. 


Related Post