అమెరికన్లకే భోగ(స్) విల్లి కుచ్చు టోపీ

October 29, 2016
img

భారత్ తో ప్రజలని బోగస్ సంస్థలు రకరకాలుగా మోసగించడం నిత్యం చూస్తూనే ఉంటాము. అటువంటివాతిని ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకపోవడంతో అవి ప్రజల బలహీనతలని ఉపయోగించుకొని మోసాలకి పాల్పడుతుంటాయి. కానీ చాలా కట్టుదిట్టమైన వ్యవస్థగా పేరొందిన అమెరికాలో కూడా ఇటువంటి మోసాలు జరుగుతుండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అమెరికాలో భారతీయులు చాలా తెలివైనవాళ్ళు..చాలా కష్టపడి పనిచేస్తారనే మంచి పేరుంది. కానీ మన దేశానికే చెందిన కొందరు దానిని పాడుచేస్తున్నారు. 

ఆదాయపన్ను శాఖకి చెందిన అధికారులమని చెపుతూ అమెరికన్ ప్రజలని భయపెట్టి కోట్లాది డాలర్లు డబ్బు గుంజిన హైదరాబాద్ కి చెందిన భోగవల్లి నరసింహ అనే వ్యక్తిని గురువారం అమెరికా ఎఫ్.బి.ఐ.అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. అతనితో బాటు మరో 20మందిని కూడా వారు అదుపులోకి తీసుకొని, టెక్సాస్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. అది ప్రవసభారతీయులతో సహా భారత్ కి కూడా చాలా అవమానకరమైన విషయమే.

ఈ కుట్ర ఎలాగ జరిగింది అంటే, భోగవల్లి నరసింహ టెక్సాస్ రాష్ట్రంలో ఇర్వింగ్ పట్టణంలో టచ్ స్టోన్ కమోడిటీస్, టెక్ డైనమిక్ ఇండస్ట్రీస్ అనే రెండు సంస్థలని స్థాపించాడు. వాటిలో ఒకటి ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ సంస్థ అని మరొకదానితో అవుట్ సోర్సింగ్, కన్సల్టింగ్ సేవలని అందజేస్తున్నట్లు చెప్పుకొంటాడు. కానీ తను చేసే మోసాలకి దానిని ఒక ముసుగుగా వాడుకొంటున్నట్లు తేలింది. 

ఆదాయపన్ను శాఖలోని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసస్ (ఐ.ఆర్.ఎస్.)అనే విభాగం ఒకటి ఉంది. అది దేశంలో పన్ను ఎగవేతదారులని గుర్తించి, వ్వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి తమ శాఖకి సహకరిస్తుంటుంది. భోగవల్లితో సహా నిన్న పట్టుబడిన వారందరూ ఈ ఐ.ఆర్.ఎస్. పేరునే వాడుకొని గత రెండేళ్ళుగా అమెరికన్ ప్రజలని భయపెడుతూ వారి నుంచి కోట్లాది డాలర్లు పిండుకొంటున్నారు.

హెచ్ గ్లోబల్, కాల్ మంత్రం, వరల్డ్ వైడ్ సొల్యూషన్స్, జోరియన్ కమ్యూనికేషన్స్, శర్మ బీపివో అనే 5 సంస్థలు కూడా ఇటువంటి మోసాలకి పాల్పడుతున్నాయి. కానీ అవన్నీ భారత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తుండటం విశేషం.

భోగవల్లి నరసింహ మాత్రం ఏకంగా అమెరికాలోనే కార్యాలయం తెరిచేసి అమెరికన్ ప్రజలని దోచేస్తూ ఎఫ్.బి.ఐ.కి పట్టుబడిపోయాడు. ఆదాయపన్ను చెల్లింపులలో చాలా తెదాలున్నట్లు తాము గుర్తించామని, కనుక తక్షణం దానికి తాము చెప్పినంత జరిమానాలు చెల్లించకపోయినట్లయితే అరెస్ట్ వారంట్లు జారీ చేస్తామని అమెరికన్ ప్రజలకి బోగవల్లికి, సదరు ఐదు బోగస్ సంస్థలకి చెందిన వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి. వాటికి భయపడి ప్రజలు వారు కోరినట్లుగానే వారు పేర్కొన్న బ్యాంక్ ఖాతాలలో డబ్బుని ఆన్-లైన్ ద్వారా లేదా మనియార్డర్ ద్వారా జామా చేసేవారు. కనీసం అప్పుడైనా ఆదాయపన్ను శాఖ అధికారులు  ప్రైవేట్ సంస్థలకి చెందిన బ్యాంక్ ఖాతాలలో డబ్బు జమా చేయమని ఎందుకు అడుగుతున్నారు. మనియార్డర్ల ద్వారా ఎందుకు జామా చేయమంటున్నారనే అనుమానం వారెవరికీ కలుగకపోవడం చాలా విచిత్రంగానే ఉంది. అదే విధంగా ఇటువంటి అనుమానిత లావాదేవీలని నిశితంగా గమనించడానికి అత్యాధునిక వ్యస్థలు, సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు చేసుకొన్న అమెరికన్ బ్యాంకులు, నిఘా అధికారులు ఇంతకాలం వరకు కనుగొనలేకపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

భోగావిల్లి అతని అనుచరుల బెదిరింపులకి భయపడి, వారు చెప్పినట్లుగానే టచ్ స్టోన్ కమోడిటీస్ పేరిట ఉన్న సిటీ బ్యాంక్ ఖాతాలో నవంబర్ 2014 నుంచి ఫిబ్రవరి 2015లోగా మొత్తం రూ.11.29 కోట్లు జామా అయినట్లు ఎఫ్.బి.ఐ. అధికారులు గుర్తించారు. దానిని 60 మనియార్డర్లు, 2,250 ప్రత్యేక మనియార్డర్ల ద్వారా అతని ఖాతాలో డబ్బు జమా అయినట్లు గుర్తించారు. ఆ డబ్బుని భోగవల్లి తన ఇతర ఖాతలలోకి బదిలీ చేస్తుండేవాడు. కొంతసొమ్ముని భారత్ కి పంపింస్తుండేవాడని గుర్తించారు.

Related Post