బైడెన్‌ ప్రభుత్వంలో 12మంది భారతీయులకు కీలక పదవులు

January 13, 2021
img

ఈ నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న జో బైడెన్‌ తన ప్రభుత్వంలో 12 మంది భారతీయులకు అత్యంత కీలక పదవులు కట్టబెట్టడం విశేషం. భారతీయుల మేధోశక్తి, విధేయత, కష్టపడి పనిచేసే గుణాల కారణంగానే ఇంత ప్రాధాన్యత లభిస్తోందని భావించవచ్చు. జో బైడెన్‌ ప్రభుత్వంలోని ఆ 12మంది భారతీయులు వారు చేపట్టబోతున్న కీలకపదవుల వివరాలు: 

1. అందరికంటే ముందుగా చెప్పుకోవలసిన వ్యక్తి కమలా హారిస్‌. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

2. నీరా టాండన్: డైరక్టర్ ఆఫ్ ద వైట్‌హౌస్‌ ఆఫీస్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ బడ్జెట్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. వివిద ఫెడరల్ ఏజన్సీల బడ్జెట్‌ కేటాయింపులను ఆమె పర్యవేక్షించనున్నారు. 

3. డాక్టర్ వివేక్‌మూర్తి: యూఎస్ సర్జన్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 

4. వినీత గుప్తా: అల్యూమినస్ ఆఫ్ న్యూయార్క్‌ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాకు అసోసియేట్ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 

5. అయిషా షా:  వైట్‌హౌస్‌ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రేటజీ అధిపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 

6. గౌతమ్ రాఘవన్:  ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 

7. భరత్‌ రామ్మూర్తి: నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 

8. వినయ్ రెడ్డి: అధ్యక్షుడి ప్రసంగాలను తయారుచేసే విభాగానికి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 

9. తరుణ్ చబ్రా: టెక్నాలజీ మరియు నేషనల్ సెక్యూరిటీ విభాగానికి సీనియర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 

10. సుమన్ గుహ: నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (దక్షిణ ఆసియా) విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

11. సబ్రీనా సింగ్‌: డెప్యూటీ ప్రెస్‌ సెక్రెటరీ. 

12. వేదాంత్ పటేల్: అసిస్టెంట్ ప్రెస్‌ సెక్రెటరీ.

13. శక్తి కలత్తిల్: డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ విభాగానికి కో-ఆర్డినేటర్.

Related Post