నేడు ట్రంప్‌-బిడెన్ ముఖాముఖి బహిరంగ చర్చ

September 30, 2020
img

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కేవలం 5 వారాలు మాత్రమే ఉంది. కనుక అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పోటీ పడుతున్న రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీ అభ్యర్ధులు వివిద అంశాలపై తమ అభిప్రాయాలను, విధానాల గురించి ముఖాముఖి చర్చలో పాల్గొనడం ఆనవాయితీ. ఎన్నికలు జరిగేలోగా మూడుసార్లు ఇటువంటి ముఖాముఖి చర్చలలో ఇరు పార్టీల అభ్యర్ధులు పాల్గొని తమ వాదనలతో ప్రజలను మెప్పించవలసి ఉంటుంది. వాటి ఆధారంగా అమెరికన్లు తమ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొంటుంటారు.     

భారత్‌ కాలమాన ప్రకారం బుదవారం ఉదయం 6 గంటలకు ఒహియో రాష్ట్రంలో క్లీవ్ ల్యాండ్‌లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో ఈ చర్చ జరిగింది. సుమారు గంటన్నరసేపు సాగిన ఈ ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్ధిగా మళ్ళీ పోటీ పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జో బిడెన్ పాల్గొని ఆరు అంశాలపై తమతమ వాదనలను వినిపించి, ఎదుట వ్యక్తి కంటే తమ విధానాలు, వాదనలు సరైనవని నిరూపించుకొనేందుకు ప్రయత్నించారు.     

దీని తరువాత మళ్ళీ అక్టోబర్ 15వ తేదీన మయామిలోని అడ్రియన్ ఎర్స్ట్ సెంటర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్‌లో, చివరిగా అక్టోబర్ 22న నాష్విల్లెలోని బెల్మాంట్ విశ్వవిద్యాలయం జరుగుతుంది. 

అక్టోబర్ 7వ తేదీన కింగ్స్‌వ్రే హాల్‌లోని ఉటా యూనివర్శిటీ ఆఫ్ సాల్ట్ లేక్ సిటీలో ఉపాధ్యక్ష అభ్యర్ధుల మద్య ముఖాముఖి చర్చ జరుగనుంది.

Related Post