నేను గెలిస్తే భారత్‌కు సంపూర్ణ మద్దతు: జో బైడెన్

August 17, 2020
img

ఈ ఏడాది నవంబర్‌ 3న జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జో బైడెన్ దేశంలో స్థిరపడిన ప్రవాసభారతీయులను ఆకర్షించి వారి ఓట్లను సంపాదించుకొనేందుకు అనేక వాగ్ధానాలు చేస్తున్నారు. భారత్‌ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ తమ పార్టీ విధానాలను ప్రకటించారు. అవేమిటంటే...

1.  హెచ్-1బీ వీసాల జారీపై ప్రస్తుతం విధించిన అన్ని ఆంక్షలను రద్దు చేసి సరళమైన విధానాలను ప్రవేశపెడతాము. ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చే వారికోసం మరింత ఎక్కువ వీసాలు జారీ చేస్తాము.  

2. హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వచ్చి పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇచ్చే ఎల్-4 వీసాలపై ఆంక్షలు రద్దు చేస్తాము. 

3. దేశాలవారీగా గ్రీన్‌ కార్డ్ జారీ చేసే విధానానికి స్వస్తి పలికి నూతన విదానాన్ని ప్రవేశపెట్టి, గ్రీన్‌ కార్డులను మరింత పెంచుతాము. 

4. అమెరికాలో చదువుకొంటున్న విద్యార్దులపై ఆంక్షలు ఎత్తివేస్తాము. 

5. అమెరికాలో స్థిరపడిన భారతీయులకు మరింత భద్రత కల్పిస్తాము.  

6. సరిహద్దులలో పాకిస్థాన్‌, చైనా దేశాల నుంచి సవాళ్ళు ఎదుర్కొంటున్న భారత్‌కు అండగా నిలబడి అన్ని విధాలా సహాయసహకారాలు అందజేస్తాము. 

7.  భారత్‌తో ద్వైపాక్షిక, వ్యాపార సంబంధాలు, ఇరుదేశాల మద్య స్నేహసంబంధాలు మరింత పెరిగేందుకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. 

Related Post