వైట్‌హౌస్ ఎదుట కాల్పులు

August 11, 2020
img

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్ బయట ఓ వ్యక్తి కాల్పులు జరుపడం కలకలం సృష్టించింది. ఆ సమయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. బయట కాల్పుల శబ్ధం వినిపించగానే భద్రతా సిబ్బంది సూచన మేరకు ఆయన అర్ధాంతరంగా సమావేశం ముగించి లోపలకు వెళ్ళిపోయారు. భద్రతాదళాలు ఆ వ్యక్తిని చుట్టుముట్టి తుపాకీతో కాల్చి సజీవంగా పట్టుకొని ఆసుపత్రికి తరలించారు. వైట్‌హౌస్‌ పరిసరాలన్నీ క్షుణ్ణంగా గాలించి మరెవరూ లేరని నిర్ధారించుకొని ట్రంప్‌కు ఆ విషయం తెలియజేసిన తరువాత మళ్ళీ తిరిగివచ్చి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.స్థానిక కాలమానప్రకారం ఈ ఘటన సోమవారం సాయంత్రం సుమారు 6.30 గంటలకు జరిగింది.  

ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వైట్‌హౌస్‌ ఆవరణలో ఎటువంటి కాల్పులు జరుగలేదని, పెన్సిల్వేనియా, స్ట్రీట్ 17లో కాల్పులు జరిగాయని, సీక్రెట్ సర్వీస్ అతనిని షూట్ చేసి ఆసుపత్రికి తరలించారని చెప్పారు. వైట్‌హౌస్‌ పరిధిలోకి ఎవరూ ప్రవేశించలేదని చెప్పారు. ఈ ప్రపంచమంతా ప్రమాదకరమైన ప్రదేశంగా మారిపోయిందని అన్నారు. కానీ సీక్రెట్ సర్వీస్ పోలీసుల రక్షణ వలయంలో వైట్‌హౌస్‌ ఉన్నందున ఇక్కడ తాను భద్రంగా ఉన్నట్లు భావిస్తున్నానని ట్రంప్‌ అన్నారు.

Related Post