న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జీగా సరితా కోమటిరెడ్డి

May 05, 2020
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డిని న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేశారు. ఈమేరకు  ఆమె నామినేషన్ పత్రాలపై ట్రంప్‌ సంతకం చేసి అమెరికా సెనేట్‌కు పంపించినట్లు వైట్ హౌస్ దృవీకరించింది. 

ఆమె హార్వర్డ్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందిన తరువాత కొంతకాలం హాన్‌సేన్‌లోని కెల్లాగ్‌లో న్యాయవాదిగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత కొలంబియా సర్క్యూట్‌లో యుఎస్ కోర్ట్ ఆఫ్ ఎప్పియల్స్ లో లా క్లర్కుగా, యూఎస్ జాతీయ కమీషన్‌ (ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ అండ్ ఆయిల్ స్పిల్)లో కౌన్సిల్‌గా, న్యూయార్క్‌ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ లోగల యుఎస్ అటార్నీ ఆఫీస్‌లో కంప్యూటర్ హ్యాకింగ్ మరియు ఇంటలేక్ట్యువల్ ప్రాపర్టీ కో-ఆర్డినేటర్‌గా, ఈ పదవి చేపట్టే ముందు డెప్యూటీ చీఫ్ ఆఫ్ జనరల్ క్రైమ్స్ గా పనిచేశారు. 

అమెరికాలో పైకి ఎదిగేందుకు అందరికీ చాలా అవకాశాలుంటాయి కానీ ఒక విదేశీ సంతతికి చెందిన వ్యక్తి ఈ స్థాయికి ఎదగాలంటే చాలా కృషి, పట్టుదల, ప్రతిభాపాఠవాలు కలిగి ఉండాలి. సరితా కోమటిరెడ్డిలో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నందునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆమెను ఈ పదవికి నామినేట్ చేశారని చెప్పవచ్చు. 

Related Post