రష్యా ప్రధానికి కరోనా పాజిటివ్

May 01, 2020
img

కంటికి కనబడని కరోనా మహమ్మారి ధనిక..పేద, సామాన్య ప్రజలు...దేశాధ్యక్షులు అనే తేడా చూపించకుండా అందరి మీద సమానంగా దాడి చేస్తోంది. గతనెల 30వ తేదీన స్పెయిన్ యువరాణి మేరియా థెరీసా కరోనా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈనెల 8వ తేదీన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కరోనా సోకి ఆసుపత్రిపాలయ్యారు. రెండువారాల చికిత్స తరువాత ఆయన కోలుకొని మళ్ళీ ఇంటికి చేరుకొన్నారు. తాజాగా రష్యా ప్రధానమంత్రి మీఖాయిల్ మిషుస్టీన్‌కు కరోనా సోకింది. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన తన నివాసంలోనే ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. 

నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 32,56,846 మందికి కరోనా వైరస్ శోకగా వారిలో 10,14,753 మంది కోలుకొన్నారు. 2,33,388 మంది కరోనాకు బలయ్యారు.

Related Post