అమెరికాలో భారతీయ వైద్యురాలికి అరుదైన గౌరవం

April 21, 2020
img

కరోనా మహమ్మారితో పోరాడుతున్న అమెరికాకు ఈ కష్టకాలంలో అత్యున్నతమైన సేవలు అందిస్తున్నందుకుగాను ఒక భారతీయ వైద్యురాలికి అరుదైన గౌరవం లభించింది. కనెక్టికట్ రాష్ట్రంలో హార్ట్ ఫోల్డ్ కంట్రీ అనే నగరంలో గల సౌత్ విండ్సర్‌లో ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న మైసూరుకు చెందిన డాక్టర్ ఉమా మధుసూధన్ అనే వైద్యురాలికి ఈ అరుదైన గౌరవం లభించింది. 

కరోనా రోగులకు ఆమె విశేషసేవలందిస్తునందుకు సౌత్ విండ్సర్ ప్రజలు అంబులెన్సు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, వందలాదిమంది పౌరులు చాలా విన్నూత్నంగా ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారందరూ తమ తమ వాహనాలతో ఆమె నివాసం వద్దకు ర్యాలీగా బయలుదేరి కొందరు తమ వాహనాల హారన్లు మ్రోగిస్తూ కృతజ్ఞతలు తెలుపగా... మరికొందరు తమ వాహనాలలో నుంచి “థాంక్యూ డాక్టర్” అని వ్రాసున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సుమారు 100-200 వాహనాలలో వారు తరలివచ్చి కృతజ్ఞతలు తెలుపుకొంటుండగా డాక్టర్ ఉమా మధుసూధన్ తన నివాసం బయట నిలబడి వారందరికీ అభివాదం చేశారు. ఒక వైద్యురాలికి ఇంతకంటే గొప్ప గుర్తింపు గౌరవం ఇంకేముంటుంది? అందునా ఓ విదేశంలో... విదేశీయుల నుంచి! 



Related Post