డోనాల్డ్ ట్రంప్‌ సంచలన నిర్ణయం

April 21, 2020
img

కరోనా వైరస్‌ దెబ్బకు విలవిలలాడుతున్న అమెరికాను కాపాడుకొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. “కంటికి కనిపించని శత్రువు దాడి చేస్తున్న ఈ సమయంలో  అమెరికా పౌరుల ఉద్యోగాలను కూడా కాపాడవలసి ఉన్నందున, అమెరికాలో ఉద్యోగాల కోసం వచ్చేవారిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయబోతున్నాను,” అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ట్వీట్ ద్వారా తెలియజేశారు. 

అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలకు, మృతుల సంఖ్య 42,604కి చేరుకొంది. లాక్‌డౌన్‌ కారణంగా కోట్లాదిమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోవడంతో ఇప్పటివరకు 2.2 కోట్ల మంది నిరుద్యోగభృతికి దరఖాస్తు చేసుకొన్నారు. ఒకవైపు నానాటికీ కరోనాకేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతుంటే, మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా నిరుద్యోగభృతికి దరఖాస్తు చేసుకొనేవారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌ కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంటే, సరిగ్గా ఇదే సమయంలో నిరుధ్యోగులను పోషించవలసిన భారం ప్రభుత్వంపై పడుతోంది. కనుక అమెరికా పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు డోనాల్డ్ ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని భావించవచ్చు. 


Related Post