హెచ్-1బీ వీసాదారులకు శుభవార్త

April 15, 2020
img

హెచ్-1బీ వీసాలతో అమెరికావెళ్ళినవారికి ఓ శుభవార్త. హెచ్-1బీ వీసాలతో అమెరికాలో పనిచేస్తున్నవారు గడువులోగా దరఖాస్తు చేసుకొంటే 240 రోజులు పొడిగిస్తామని హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తన వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేసింది. ప్రస్తుత కరోనా సంక్షోభం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని త్వరలో ఈ వీసాల గడువు ముగుస్తున్నవారందరికీ ఈ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. ఒకవేళ ఏ కారణం చేతైనా గడువులోగా దరఖాస్తు చేసుకోలేకపోయినా లేదా ఆలస్యంగా దరఖాస్తు చేసుకొన్నవారివి కూడా ఈ అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సానుభూతితో పరిశీలిస్తామని తెలియజేసింది. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా వీసాల గడువు ముగిసిన తరువాత కూడా ఇంకా దేశంలో ఉంటున్నవారిపై చట్టప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోబోమని తెలియజేసింది.

ఇదివరకు హెచ్-1బీ వీసాల గడువు ముగిస్తే వాటిని పునరుద్దరించుకోవడానికి లేదా స్వదేశాలకు తిరిగి వెళ్ళడానికి 60 రోజులు మాత్రమే గడువు ఉండేది. కానీ ఈ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఆ గడువును 240 రోజులకు పొడిగించడంతో ఆ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాదిమంది ప్రవాస భారతీయులకు, వివిద దేశస్థులకు చాలా ఊరట లభిస్తుంది.

Related Post