కరోనా బారినపడిన సౌదీ రాజకుటుంబం?

April 10, 2020
img

సౌదీ అరేబియా యువరాజు, రియాద్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఫైసల్ బిన్ బందర్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్‌తో సహా సౌదీ రాజకుటుంబంలో సుమారు 150 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు ప్రముఖ అమెరికన్ దినపత్రిక న్యూయార్క్‌ టైమ్స్ పేర్కొంది. వారిలో సౌదీ రాజుగారు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ఉన్నారని సమాచారం. వారందరూ సౌదీలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రి ఐసీయూలో చేరి చికిత్స పొందుతున్నట్లు వారి సన్నిహితవర్గాల ద్వారా సమాచారం అందిందని న్యూయార్క్‌ టైమ్స్ పేర్కొంది. 

సౌదీ రాజకుటుంబంలో వేలమంది యువరాజులున్నారు. వారు తరచూ వ్యక్తిగత, అధికారిక పనుల మీద యూరప్ దేశాలకు వెళ్ళివస్తుంటారు. వారికి కూడా కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది కనుక అవసరమైతే వారికి చికిత్స అందించేందుకుగాను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆసుపత్రులలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సౌదీ ప్రభుత్వం ఆదేశాలు పంపినట్లు న్యూయార్క్‌ టైమ్స్ పేర్కొంది. అలాగే రాజకుటుంబాలకు సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా కరోనా సోకే అవకాశం ఉన్నందున వారందరికీ కూడా ఎలైట్ ఆసుపత్రితో సహా ఇతర ఆసుపత్రులలో చికిత్స అందించేందుకు తక్షణం అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశాలు పంపబడినట్లు న్యూయార్క్‌ టైమ్స్ పేర్కొంది. 

సౌదీ అరేబియాలో నేటివరకు 3,287 మందికి కరోనా సోకగా వారిలో 666 మంది కొలుకొంటున్నారు. 44 మంది మరణించారు.

గమనిక: మీ కంప్యూటర్లలో, మొబైల్ ఫోన్లలో www.mytelangana.com ను బుక్ మార్క్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము.

Related Post