వారు అమెరికాకు తిరిగి వెళుతున్నారు!

April 08, 2020
img

కరోనా.. లాక్‌డౌన్‌తో వివిద దేశాల ప్రజలు ఇతరదేశాలలో చిక్కుకుపోయారు. భారత్‌లో కూడా అనేకమంది అమెరికన్లు చిక్కుకుపోయారు. వారిలో విదేశీ పర్యాటకులు, బిజినెస్ పనులపై వచ్చినవారు, అమెరికా ఎంబసీలలో పనిచేస్తున్నవారూ ఉన్నారు. అమెరికా విజ్ఞప్తి మేరకు వారినందరినీ ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలలో అమెరికాకు తరలిస్తోంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి 99 మందితో ఎయిర్ ఇండియా విమానం అమెరికాకు బయలుదేరింది. 

ఈ వారంలో మరో 5 విమానాలు అమెరికాకు బయలుదేరుతాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో మరిన్ని ప్రత్యేక విమానాలు నడిపించడం సాధ్యం కాదని కనుక ఇంకా భారత్‌లో ఎవరైనా అమెరికన్లు ఉన్నట్లయితే వారందరూ తక్షణమే వాటిలో అమెరికా తిరిగిరావాలని లేదా మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకు అంటే కొన్ని నెలలపాటు భారత్‌లోనే ఉండిపోయేందుకు సిద్దపడాలని అమెరికా విదేశాంగశాఖ అండర్ సెక్రెటరీ (దక్షిణ, మద్య ఆసియా) ఆలిస్ వెల్స్ అన్నారు. 

అమెరికన్లు, స్వదేశానికి తిరిగివెళ్ళిపోవాలనుకోవడం, వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడం సహజమే. కానీ ప్రస్తుత పరిస్థితులలో అమెరికాకు తిరిగి వెళ్ళడం కంటే భారత్‌లో ఉండిపోవడమే వారికి మంచిది. అమెరికాకు తిరిగి వెళ్లడమంటే కరోనా హాట్‌స్పాట్‌లోకి ప్రవేశించడంగానే భావించవలసి ఉంటుంది. కానీ అందుకు వారు సిద్దపడుతున్నారు కనుక భారత్‌ నుంచి ప్రత్యేక విమానాలు అమెరికాకు బయలుదేరుతున్నాయి.

Related Post