కరోనాతో పోరాడుతున్న అగ్రరాజ్యాలు

March 31, 2020
img

కరోనా వైరస్‌ గురించి మొదటిసారి విన్నప్పుడు దాని వలన మనకేమీ ప్రమాదం ఉండబోదని అన్ని దేశాలు భావించాయి. కరోనాను చూసి భారత్‌, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు భయపడాలి తప్ప తమవంటి అభివృద్ధి చెందిన ఆగ్రరాజ్యాలు, యూరోపియన్ దేశాలు కాదనే భావన కనిపించేది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఇటలీ, స్పెయిన్, అమెరికా, జర్మనీ, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రాణాలు పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్నాయి. 

తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో 1,64, 406 (3,172 మృతులు), ఇటలీలో 1,01,739 (11,591 మృతులు), స్పెయిన్-87,956 (7,716 మృతులు), చైనా-81,518 (3,305 మృతులు) , జర్మనీ-67,051 (657 మృతులు), ఫ్రాన్స్-43,973 (3,018 మృతులు), బ్రిటన్-22,141 (1,408 మృతులు), ఇరాన్‌-41,495 కరోనా కేసులు(2,757 మంది మృతులు) నమోదు కాగా కరోనా కేసులు, మృతుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతూనే ఉంది తప్ప ఆగడం లేదు. 

నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కలిపి మొత్తం 7,87,010 మంది కరోనా వైరస్ బారినపడగా వారిలో 1,66,214 మంది కోలుకొన్నారు. కరోనా బారినపడి 37, 829 మంది చనిపోయారు. 

Related Post