భారత్‌ పర్యటన ట్రంప్‌కు లబ్ది కలుగుతుందా?

February 21, 2020
img

ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్‌ మళ్ళీ మరోసారి అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. కనుక అధ్యక్ష ఎన్నికలకు ముందు భారత పర్యటనతో అమెరికాలోని ప్రవాసభారతీయులను ట్రంప్ ఆకర్షించగలరా లేదా అనే చర్చ నడుస్తోంది. 

ఈ పర్యటనలో ట్రంప్ భారత్‌కు ఏమైనా మేలు చేయగలిగితే తప్పకుండా ఆ ప్రభావం అధ్యక్ష ఎన్నికలలో ఎంతో కొంత ఉంటుంది. కానీ అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హెచ్-1బీ, హెచ్-4 వీసాలు, గ్రీన్ కార్డు విషయంలో ప్రవాసభారతీయులకు, ముఖ్యంగా ఐ‌టి కంపెనీలకు వాటి ఉద్యోగులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు. కనుక అధ్యక్ష ఎన్నికలకు 9 నెలల ముందు ట్రంప్ చేయబోతున్న భారత్‌ పర్యటన కంటే, మిగిలిన 9 నెలల కాలంలో ఆయన ఏమైనా నష్టనివారణ చర్యలు చేపడితే అమెరికాలోని ప్రవాస భారతీయులలో ఆయన పట్ల సానుకూలత ఏర్పడవచ్చు. కానీ వీసాలు, ఉద్యోగాల విషయంలో తాను తీసుకొన్న కటిన నిర్ణయాల కారణంగా అమెరికన్లు అందరూ తనవెంటే ఉన్నారని బలంగా నమ్ముతున్న డొనాల్డ్ ట్రంప్, ప్రవాసభారతీయుల ఓట్ల కోసం తన వైఖరిని మార్చుకొంటారనుకోలేము. ఒకవేళ మార్చుకొన్నా అది ఎన్నికల కోసమేనని ప్రవాస భారతీయులు భావించినట్లయితే ఈసారి మళ్ళీ డెమొక్రాట్లవైపు మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదు. 

Related Post