బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా దాడి

January 03, 2020
img

ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా దళాలు శుక్రవారం తెల్లవారుజామున రాకెట్లతో దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాక్ క్వాడ్స్ ఫోర్స్ ఛీఫ్ జనరల్ ఖాసీం సోలేమన్‌, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహ్మదీ మూహండీస్‌తో సహా మొత్తం 8 మంది ఉన్నత సైన్యాధికారులు మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అమెరికా రక్షణ విభాగం పెంటాగన్ ప్రకటించింది. ఇరాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై ఇటీవల జరిగిన దాడులలో ఖాసీం సోలేమన్‌తో సహా మృతుల ప్రమేయం ఉందని, వారు భవిష్యత్‌లో విదేశాలలో ఉన్న అమెరికా అధికారులపై కూడా దాడులు చేయడానికి కుట్రలు పన్నుతున్నారనే సమాచారం తమవద్ద ఉందని అందుకే రక్షణాత్మక చర్యగా ఈ దాడులు జరిపినట్లు పెంటాగన్ తెలిపింది. 


Related Post