అమెరికాలో హైదరాబాద్‌ యువతికి బ్రెయిన్ డెడ్‌

December 31, 2019
img

హైదరాబాద్‌లో నేరేడ్‌మెట్‌కు చెందిన చరితారెడ్డి (25) అనే యువతికి అమెరికాలో  డెలాయిట్ సంస్థలో ఉద్యోగం రావడంతో 4 ఏళ్ళు క్రితం అక్కడకు వెళ్లింది. అంత చిన్న వయసులోనే ఆ స్థాయికి ఎదిగిన ఆమెకు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుందని వేరే చెప్పక్కరలేదు కానీ ఆమె విధిరాత మరోలా ఉంది. 

అమెరికా కాలమాన ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని మిచిగాన్ నగరంలో లాన్సింగ్ అనే ప్రాంతంలో ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా వెనుకనుంచి అతివేగంగా దూసుకువచ్చిన మరోకారు ఆమె కారును డ్డీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ తీవ్రంగా గాయపడటంతో వైద్యులు ఆమె ‘బ్రెయిన్ డెడ్‌’ పరిస్థితిలో ఉన్నట్లు ప్రకటించారు. అంటే బ్రతికి ఉన్నప్పటికీ చనిపోయినట్లే! ఆమె పరిస్థితి గురించి తెలిసి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

Related Post