అమెరికాలో ఆర్టీసీ సెగలు!

November 11, 2019
img

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు, ప్రతిపక్షాలే కాదు...అమెరికాలో స్థిరపడిన తెలంగాణవాసులు కూడా వ్యతిరేకిస్తుండటం విశేషం. వాషింగ్టన్‌లో తెలంగాణ అభివృద్ధి వేదిక వార్షికోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం తరపున రాశ్త్ర్ ప్రణాళికా సంఘం వైసీపీ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు, కొందరు ఎన్ఆర్ఐలు లేచి ‘సేవ్ ఆర్టీసీ’ అని వ్రాసున్న ప్లకార్డులు ప్రదర్శించారు. కానీ వాటిని పట్టించుకోకుండా వినోద్ కుమార్ తన ప్రసంగం కొనసాగించడంతో వారు ఈసారి సేవ్ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. కానీ ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికి అమెరికాలో స్థిరపడిన తెలంగాణవాసులు అందరూ సహాయసహకారాలు అందజేయాలని కోరారు. 


Related Post