అమెరికాలో తెలుగు టెకీ ఆకస్మిక మృతి

November 02, 2019
img

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న శివ చలపతిరాజు అనే తెలుగు వ్యక్తి మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పూర్తి వివరాలు, మృతికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. ఆయన స్వస్థలం ఏపీలో రాజమండ్రి కాగా ఆయన భార్య సౌజన్యది భీమవరం. ప్రస్తుతం ఆమె నిండు గర్భవతి. 

శివ చలపతిరాజు అమెరికా వచ్చి చాలా కాలం కావడంతో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. మొదట మిచిగాన్‌లో విప్రో కంపెనీలో ఆ తరువాత ఇలీనాయిస్‌లో గల బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలలో పనిచేసిన శివ చలపతిరాజు చనిపోయే సమయానికి నార్త్ కరోలినాలో ఒరాకిల్ సంస్థలో పనిచేస్తున్నారు. అక్కడే తన భార్య బాబీ సౌజన్యతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే శివ చలపతిరాజు ఆకస్మికంగా చనిపోవడంతో అమెరికా నిబందనల ప్రకారం ఆయన భార్య సౌజన్య తక్షణం స్వదేశానికి తిరిగివెళ్లిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. 

చాలా హాయిగా సాఫీగా జీవితం సాగిపోతోందనుకొంటున్న సమయంలో ఆమెకు ఇటువంటి దుస్థితి ఏర్పడటం చూసి వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. శివ చలపతిరాజు మృతదేహాన్ని భారత్‌కు తిప్పి పంపేందుకు అమెరికాలో పీడ్‌మాంట్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌ సభ్యులు విరాళాలు పోగుచేస్తున్నారు.

Related Post