భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న ఎన్ఆర్ఐ దంపతులు

October 01, 2019
img

అమెరికాలో గొప్ప పేరొందిన వైద్య దంపతులు డాక్టర్ కిరణ్ పటేల్, డాక్టర్ పల్లవి పటేల్ గుజరాత్‌లో సుమారు రూ.1,400 కోట్లు పెట్టుబడితో వైద్యకళాశాలలు ఏర్పాటుచేయబోతున్నారు. ముందుగా వారి స్వస్థలమైన బరూచ్‌లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక వైద్యకళాశాలను, దానికి అనుబందంగా అతిపెద్ద అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. గుజరాత్ ప్రభుత్వం సహకరిస్తే మూడేళ్ళలోగా ఆసుపత్రిని, వైద్యకళాశాలను ప్రారంభించాలనుకొంటున్నారు. ఇదికాక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో కూడా మరో మూడు అత్యాధునిక ఆసుపత్రులను, వైద్యకళాశాలను ప్రారంభించాలనుకొంటున్నారు. వాటిలో రెండు వైద్యకళాశాలలో భారతీయ డిగ్రీకోర్సులను, ఒక దానిలో మాత్రం అమెరికాకు చెందిన సౌత్ ఈస్ట్ యూనివర్సిటీ కోర్సులను ప్రవేశపెట్టాలని వారు భావిస్తున్నారు. ఈ మూడు వైద్య కళాశాలలో కూడా గ్రామీణఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకొంటున్నారు. వైద్య కళాశాలల నిర్మాణానికి, వైద్య కళాశాలల ఏర్పాటు ముందస్తు పనుల నిమిత్తం డాక్టర్ కిరణ్ పటేల్ ఈనెలాఖరులోగా భారత్‌ రాబోతున్నారు.      


Related Post