సౌదీ అరేబియా సంచలన నిర్ణయం

September 27, 2019
img

సౌదీ అరేబియా దేశంలో కటినమైన నియమనిబందనలు, నేరాలకు కటిన శిక్షలు అమలుచేయడం, మహిళలపై తీవ్ర ఆంక్షలు, వినోదానికి తావులేని పరిస్థితుల కారణంగా సౌదీ అరేబియా అంటే ప్రపంచంలో అతిపెద్ద ‘ఓపెన్ జైలు’ అనే జోక్ ఉంది. అయితే గత కొన్నేళ్ళుగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అనేక సంస్కరణలు చేపడుతున్నారు.  ఆయన అమలుచేస్తున్న ‘విజన్ 2030’ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పర్యాటకరంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 

నేటికీ సౌదీ అరేబియాకు ప్రధాన ఆదాయవనరు  చమురు సరఫరా ద్వారానే వస్తుంది. ఇటీవల సౌదీ చమురు బావులపై డ్రోన్లతో దాడులు జరుగడంతో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. అది దాని ఆర్ధికస్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. బహుశః అందుకే ప్రత్యామ్నాయ ఆదాయవనరులను సృష్టించుకోవలసిన అవసరం ఉందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గ్రహించినట్లున్నారు.

దాంతో సౌదీ చరిత్రలో మొట్టమొదటిసారిగా శనివారం నుంచి పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభించింది. సౌదీలో అనేకానేక ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కానీ వాటిని పర్యటించేందుకు ఇంతవరకు విదేశీయులకు అనుమతించకపోవడంతో కేవలం ఆ దేశంలో పనిచేస్తున్న విదేశీయులు, ప్రజలు మాత్రమే వాటిని సందర్శించగలిగేవారు. కానీ ఇక నుంచి అన్ని దేశాల ప్రజలకు సౌదీలోని పర్యాటక ఆకర్షణ కేంద్రాలను దర్శించడానికి వీలవుతుంది. 

Related Post