ఎన్‌ఆర్ఐలకు శుభవార్త

September 25, 2019
img

ఎన్‌ఆర్ఐలకు ఓ శుభవార్త! ఇకపై వారు కూడా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకొని తక్షణమే పొందవచ్చు. ఇప్పటివరకు వారు ఆధార్ కార్డు పొందాలనుకుంటే దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆరు నెలలు తప్పనిసరిగా భారత్‌లో ఉండవలసివచ్చేది. కేంద్రప్రభుత్వం ఆదేశం మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ)ఆ నిబందనను ఎత్తివేసింది. ఇకపై విదేశాలలో ఉంటున్న ప్రవాసభారతీయులు నేరుగా అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా స్వదేశానికి వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకొని వెంటనే పొందవచ్చు. ప్రవాసభారతీయులకు వారి పాస్ పోర్టులో పేర్కొన్న వివరాలనే పరిగణనలోకి తీసుకొంటామని యుఐడిఎఐ తెలిపింది. కనుక వారి పాస్ పోర్టులో పేర్కొన్న వివరాలకు సంబందించి దృవీకరణపత్రాలను సమర్పించవలసి ఉంటుందని యుఐడిఎఐ తెలిపింది.       


Related Post